ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. దేవరకొండ మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్డీఓ గుగులోతు లింగ్యానాయక్, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, అధికారులు ఉన్నారు.
గ్రామాల్లో మొక్కల సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే అని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జనప్రియ గార్డెన్స్‌లో శనివారం ఎంపీడీఓలు, పంచాయతీ అధికారులు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో పల్లె ప్రగతిపై నిర్వహించిన దేవరకొండ డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గ్రీన్ ప్లాన్ ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి నర్సరీ తప్పనిసరి అని, గ్రామ అవసరాల మేరకు నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టి ఆన్‌లైన్ నమోదు, రిజిస్టర్‌ల నిర్వహణ పక్కాగా చేయాలని ఆదేశించారు. నాటిన మొక్కలలో 85 శాతానికి పైగా మొక్కల సంరక్షణ పంచాయతీ కార్యదర్శులదే అన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో 5 అడుగుల మొక్కలు నాటాలని, వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.