స్వదేశీ క్రీడ కబడ్డీని ఒలింపిక్స్‌కు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్‌రిజిజూ తెలిపారు. ఖేలో ఇండియా పథకం కింద మొత్తం 2,880 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. వీరిని జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీలకు తీర్చిదిద్దనున్నట్లు లోక్‌సభలో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. కబడ్డీ స్వదేశీ క్రీడన్నారు. ఒలింపిక్స్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఖేలో ఇండియా కింద ప్రతిభావంతులైన క్రీడాకారులను, ఉత్తమ టీంలను గుర్తించామని వీరందరికి ఆధునిక సౌకర్యాలతో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
కబడ్డీని ఒలింపిక్స్‌కు తీసుకువెళ్లేందుకు చర్యలు : కిరణ్‌రిజిజూ