జమ్ముకశ్మీర్‌లో 4జీ సేవలు పునరుద్ధరించాలని వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ బిఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టింది. 4జీ ఇంటర్‌నెట్ సేవలు లేకపోవడంతో పలు సేవలు అందడం లేదని, విద్యార్థుల ఆన్‌లైన్ తరగతుల కోసం 4జీ సేవలు అవసరం, పిటిషనర్ తరపున న్యాయవాదులు వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం జమ్ముకశ్మీర్ స్టాండింగ్ కౌన్సిల్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.