అనంతపురం సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి నిరసన వ్యకంచేస్తున్నారు. తమ రక్షణకు సరైన ఎక్విప్‌మెంట్ లేకుండా తాము వైద్యం చేయలేమని వారు స్పష్టంచేశారు. తమకు ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్స్ ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా ఇప్పటికే ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాప్ నర్సులకు కరోనా నిర్దారణ కావడంతో విధులకు హాజరయ్యేందుకు సిబ్బంది వెనకంజ వేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో జనరల్ వార్డుల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు క్యాబిన్‌లకే పరిమితమై బయటకు రావడంలేదు. కాగా మాస్కులు, పీపీఈ కిట్స్ తక్కువగా ఉన్నందున కేవలం ఐసోలేషన్ వార్డుల్లో వైద్యం అందించే సిబ్బందికి మాత్రమే వాటిని ఇస్తున్నామని, జనరల్ వార్డుల్లో పనిచేసే వైద్య సిబ్బంది పరిస్థితిని అర్థం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
అనంతపురం సర్వజన ఆస్పత్రిలో జూడాల నిరసన